'అంగన్వాడీ భవనం పూర్తి చేయండి'

ASR: అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలో గల చింతపాకలో అంగన్వాడీ భవనం పూర్తి చేయాలనీ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ భవనం లేక సుమారు 20 మంది పిల్లలకు అద్దె ఇంట్లో అట, పాటలు కొనసాగిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు గురువారం తెలిపారు. అధికారులు స్పందించి అంగన్వాడీ భవనం పూర్తి చేసి పిల్లల కష్టం తీర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.