భద్రాద్రి రాముని చెంత మతసామరస్యం
TG: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలంలో మతసామరస్యం వెల్లివిరిసింది. భద్రాద్రి రాముడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల కోసం 'షాజ్' బ్లడ్ ఆర్గనైజేషన్ సభ్యులు మహ్మద్ సిందా, మహ్మద్ ఫకీర్ మానవత్వాన్ని చాటుకున్నారు. భక్తులకు అన్నదానంతో పాటు మజ్జిగ, పానకం, వెజ్ బిర్యానీని స్వయంగా పంపిణీ చేశారు. మతాలకు అతీతంగా వీరు చేసిన పనికి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.