మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
TG: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఇటీవల మరణించిన ఉస్మానియా మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేశారు. సురేష్ కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించారు.