VIDEO: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మంచిర్యాలలోని ఓవర్ బ్రిడ్జిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. బైక్‌పై అతి వేగంతో వెళుతూ డివైడర్‌ను ఢీకొనడంతో కొండపర్తి సందీప్ అనే యువకుడు మృతి చెందగా.. మిట్టపెల్లి సుమన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.