VIDEO: ప్రతి సమస్యను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

PLD: ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. మాచర్ల పట్టణంలో సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల ప్రతి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.