జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

NLR: నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై ఆత్మకూరు మండలం వాసిలి గ్రామం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన అన్వర్ అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. టీవీఎస్ లూనాలో తమ గ్రామానికి వెళ్తూ ఉండగా నెల్లూరు నుంచి బద్వేల్ వైపు వేగంగా వెళ్తున్న ఓ కారు ఢీకొని చనిపోయాడు.