బుడమేరు గండ్లను పరిశీలించినమంత్రి

కృష్ణా: బుడమేరు వరదకు గతంలో గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టనున్నామని మంత్రి చెప్పారు. సీజన్ మొదలయ్యేలోగా 3 గండ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు చేశారు.