'కార్మిక ఉద్యమ నేత బీటీ రణదీవే స్ఫూర్తితో ఉద్యమించాలి'
MHBD: కార్మిక ఉద్యమ నేత బీటీ రణదీవే స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం బీటీ రణదీవే 36వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని బీటీ రణదీవే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు.