గురజాల రెండు నియోజకవర్గాలు అవుతుందా..?

గురజాల రెండు నియోజకవర్గాలు అవుతుందా..?

PLD: 2029 ఎన్నికల నాటికి 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమవుతుండటంతో పల్నాడులో రాజకీయ వేడి మొదలైంది. ప్రస్తుతం జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలుండగా, వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అతిపెద్ద నియోజకవర్గమైన గురజాల రెండుగా విడిపోయి, పిడుగురాళ్ల కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవించవచ్చనే ప్రచారం జోరందుకుంది.