మంగళగిరి క్రీడాకారిణికి మంత్రి లోకేష్ సాయం

మంగళగిరి క్రీడాకారిణికి మంత్రి లోకేష్ సాయం

AP: కోస్టారికాలో ఇటీవల IPF వరల్డ్ క్లాసిక్ సబ్‌జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. 57 కిలోల మహిళా జూనియర్ విభాగంలో మంగళగిరికి చెందిన క్రీడాకారిణి సాదియా అల్మాస్ సత్తాచాటింది. 470 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. కోస్టారికా వెళ్లేందుకు సాదియాకు మంత్రి లోకేష్ ఆర్థికసాయం చేశారు. దీంతో లోకేష్‌కు సాదియా కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.