నియోజకవర్గ శ్రేణులతో ఎమ్మెల్సీ బోత్స భేటీ
VZM: మాజీ మంత్రి,YCP మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మంగళవారం గరివిడి వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు నియోజకవర్గంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగిన సంతకాల సేకరణపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో సంతకాల సేకరణ చేసిన నాయకులను అభినందించారు.