'జగన్ మావిగన్ అనే పేలని తుపాకీని పట్టుకుని వేలాడుతున్నాడు'

'జగన్ మావిగన్ అనే పేలని తుపాకీని పట్టుకుని వేలాడుతున్నాడు'

KKD: జగన్ మావిగన్ అనే పేలని తుపాకీని పట్టుకుని వేలాడుతున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. జగ్గంపేటలో ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానుల పేరుతో జగన్ కేవలం కాలక్షేపం చేశారని, అమరావతి, విశాఖ, కర్నూలులో పైసా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. రాజధాని అనేది కేవలం ఒక నినాదానికే పరిమితమైందని, గత ఐదేళ్లుగా అబద్ధాలతోనే ప్రజలను వంచించారని ధ్వజమెత్తారు.