VIDEO: లక్ష్మి గణపతి ఆలయంలో చవితి ఉత్సవాలకు రాట ప్రతిష్ఠ

VIDEO: లక్ష్మి గణపతి ఆలయంలో చవితి ఉత్సవాలకు రాట ప్రతిష్ఠ

E.G: బిక్కవోలు ప్రసిద్ధ లక్ష్మి గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి, మహాలక్ష్మి దంపతులు లక్ష్మి గణపతిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చవితి ఉత్సవాలకు పందిరి రాట ప్రతిష్ఠ చేశారు. 9 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.