రేపు బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవ పూజలు

రేపు బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవ పూజలు

KDP: బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామ సమీపంలో శ్రీదేవి భూదేవి సమేత ఆది చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం గరుడోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణ అధికారి రామలింగారెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం హోమము అభిషేకం, అలాగే రాత్రికి గరుడ వాహన పూజలు ఉంటాయన్నారు. పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరగనున్నాయని చెప్పారు.