VIDEO: తెగిపడ్డ సర్వీసు వైరు.. స్థానికుల ఇబ్బందులు

VZM: బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట ప్రాంతంలో గురువారం సర్వీసు వైరు తెగిపడింది. దీనివల్ల స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని.. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.