ప్రజలను కాస్త పట్టించుకోండి: డాక్టర్ ప్రేమ్ కుమార్
గద్వాల జిల్లాలో పేదరికం, నిరక్షరాస్యత కోరల్లో చిక్కుకున్న చాలా కుటుంబాలు ఉన్నాయని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ కలెక్టర్‌కు గురువారం విన్నవించారు. జిల్లాకు నూతనంగా బదిలీలు వచ్చిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ను ఆయన కలిశారు. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. సామాన్యుడికి విద్య, వైద్యం, వ్యవసాయ ఫలాలు అందేలా కృషి చేయాలన్నారు.