అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

కోనసీమ: పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలో శుక్రవారం ఓ వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా అరెస్ట్ చేసినట్లు పి.గన్నవరం ఎస్సై శివకృష్ణ తెలిపారు. అక్రమంగా మద్యం బాటిల్‌లు అమ్ముతున్నాడనే సమాచారంతో తనిఖీలు నిర్వహించి అతని వద్ద నుంచి 11 మద్యం బాటిల్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.