'దూర ప్రాంతాలకు బస్ సర్వీసులు పెంచాలి'

GNTR: గ్రామీణ ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు బస్ సర్వీసులు పెంచాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతి పత్రం అందించారు. శుక్రవారం ఆర్టీసీ ఎండీని ఎమ్మెల్యే డిపోలో కలిసి మాట్లాడారు. 1966లో ప్రారంభమైన పొన్నూరు డిపో అనేక దశాబ్దాలుగా సేవలందించినప్పటికీ వివిధ కారణాలతో వెనకబడి పోయిందని, డిపో అభివృద్ధికి పాటుపడాలని కోరారు.