రాఖీ పౌర్ణమి సందర్భంగా అదనపు బస్సులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా అదనపు బస్సులు

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో రెగ్యులర్‌గా నడిపే బస్సులతో పాటు అదనంగా మరొక 30 స్పెషల్ ట్రిప్పులను రాఖీ పౌర్ణమి సందర్భంగా నడపనున్నట్లు డీఎం తల్లాడ రమేష్ బాబు గురువారం తెలిపారు. దేవరకొండ పరిసర ప్రాంత సోదర సోదరీమణులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపారు.