వేల్పుగొండలో అత్యధిక ఉష్ణోగ్రత
KMR: జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో పల్వంచ మండలంలోని వేల్పుగొండలో అత్య ధికంగా 43.9°C ఉష్ణోగ్రత నమోదైంది. దోమకొండ, బీబీపేట, మద్నూర్‌లో 43.8°C, బిక్కనూరులో 43.7°C నమోదు కాగా, మహమ్మద్ నగర్ మండలంలో అత్యల్పంగా 40°C నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.