జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించిన ధర్మసాగర్ జట్టు
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం చాగల్లు గ్రామంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ధర్మసాగర్ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం చాగల్లు క్రీడా మైదానంలో చక్కటి ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన ధర్మసాగర్ జట్టుకు ఒక లక్ష రూపాయల నగదు, షీల్డ్‌ను నిర్వాహకులు అందజేశారు. ధర్మసాగర్ జట్టు కెప్టెన్ జాలిగావ్ శ్రీనివాస్ షీల్డ్ తోపాటు నగదు అందుకున్నారు.