ప్రారంభమైన దాడితల్లి పండుగ

ప్రారంభమైన దాడితల్లి పండుగ

VZM: గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ ప్రారంభమైంది. గొల్లపల్లి, ఇందిరమ్మ కాలనీ, బొబ్బిలి, కృష్ణాపురం, గున్నతోటవలస, రంగరాయపురం, అప్పయ్యపేట, తదితర గ్రామాల్లో ఆదివారం అమ్మవారి వారాలు పండుగ నిర్వహిస్తున్నారు. అమ్మవారికి పూజలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉత్సవ కమిటీ సభ్యులు దాడితల్లి ఆలయం వద్ద ఏర్పాట్లు చేశారు.