చేబ్రోలులో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం
GNTR: చేబ్రోలు మండలం చేబ్రోలు, వడ్లమూడిలో ఏఓ ప్రియదర్శిని బుధవారం రైతుల పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాలలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. కౌలు రైతు కార్డుల ప్రాముఖ్యత, ఈ-పంట నమోదు విధానం గురించి రైతులకు వివరించారు. అలాగే ఈ-క్రాప్ ఇన్సూరెన్స్, వరి పంటలో వచ్చే తెగుళ్లు, కలుపు నివారణపై పలు సూచనలు చేశారు.