నాకు మద్దతుగా నిలిచినందుకు థాంక్యూ: పెమా

నాకు మద్దతుగా నిలిచినందుకు థాంక్యూ: పెమా

చైనాలో అధికారులు తనని వేధించిన సమయంలో అండగా నిలిచిన వారికి, భారత విదేశాంగశాఖ అధికారులకు అరుణాచల్ మహిళ పెమా వాంగ్ జోమ్ కృతజ్ఞతలు తెలిపారు. తన సమస్యను విదేశాంగ దృష్టికి తీసుకువెళ్లిన గంట లోపే సమస్యను పరిష్కరించిందని చెప్పారు. తనకు ఎదురైన ఇబ్బందులను బహిర్గతం చేసినప్పుడు SMలో తనపై ట్రోల్‌ చేసిన వారికి రిప్లై ఇచ్చేంత సమయం తనకు లేదన్నారు.