VIDEO: మేడారంలో తాత్కాలిక బస్టాండ్.. భక్తుల సంతోషం
MDCL: మేడారంలో తాత్కాలికంగా బస్టాండ్ ఏర్పాటు చేయడంతో, గతం కంటే ఈ సారి ఇబ్బంది లేకుండా వెళ్లి వచ్చినట్లు ఉప్పల్ నాచారం హబ్సిగూడ తార్నాక ప్రాంతాలకు చెందిన భక్తులు తెలిపారు. ఉప్పల్ నుంచి సైతం చాలా బస్సులు ఖాళీగా వెళ్లాయని, అందులో తాము వెళ్లడంతో ప్రయాణం చాలా ఈజీగా జరిగిందన్నారు. సుమారుగా 45కు పైగా బస్సులు ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడారానికి వెళ్తున్నాయి.