రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ADB: గుడిహత్నూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసి దుర్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. కిన్వట్‌కు చెందిన భానుదాస్, బాబుగిత్తే బైక్‌పై గుడిహత్నూర్‌కు వస్తుండగా వారిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భానుదాస్ (60) అక్కడికక్కడే మృతి చెందగా, బాబు గిత్తేకు గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని రిమ్స్‌కి తరలించారు.