ఈ నెల 15న అమరావతికి సీఎం చంద్రబాబు..!
పల్నాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 15న అమరావతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుని స్థానిక విజయవాడ బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం పేదలతో కలిసి భోజనం చేయనున్నారు. ఈ మేరకు గుంటూరు రోడ్డులో హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. క్యాంటీన్ ఓపెనింగ్ మాత్రమే ఉంటుందని ఎటువంటి సభ ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు.