'చిన్నారికి ఎమ్మెల్యే నివాళి'

'చిన్నారికి ఎమ్మెల్యే నివాళి'

NDL: నందికోట్కూరు మండలం బ్రాహ్మణ కోట్కూరు గ్రామానికి చెందిన రహిమాన్(లాడెన్) కూతురు కరీమున్నిసా అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య శనివారం గ్రామానికి చేరుకొని చిన్నారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.