ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
NDL: కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం గ్రామంలో సోమవారం ఎం.రంగస్వామి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రంగస్వామి మద్యానికి బానిసై ప్రతిరోజు కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. రంగస్వామిని కుటుంబ సభ్యులు మందలించడంతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.