నేటి నుంచి పులివెందులలో జగన్ పర్యటన
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో రాత్రి 7 గంటల వరకు ప్రజా దర్భార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 26న ఉదయం పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్‌లో జరిగే వివాహానికి హాజరవుతారు.