ఈ నెల 10న బీచుపల్లిలో రాముల వారి కళ్యాణోత్సవం

ఈ నెల 10న బీచుపల్లిలో రాముల వారి కళ్యాణోత్సవం

ఈనెల 10వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి దేవస్థానం వద్ద సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు శనివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. స్వామి జన్మ నక్షత్రమైన పునర్వసును పురస్కరించుకుని ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆలయ అధికారులు కోరారు.