VIDEO: పోరుమామిళ్లలో వైభవంగా కార్తిక వనభోజనాలు

VIDEO: పోరుమామిళ్లలో వైభవంగా కార్తిక వనభోజనాలు

KDP: పోరుమామిళ్ల మండలం రాయల చెరువు కట్టపై ఉన్న శ్రీభైరవ స్వామి సన్నిధిలో ఆదివారం వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ టెంకాయ కొట్టి కార్యక్రమాలను ప్రారంభించారు. చుట్టుపక్కల మండలాల నుంచి నాయకులు, భక్తులు తరలి వచ్చారు. వెంకటేశ్వర స్వామి గుడి నుంచి చెరువు కట్ట వరకు ర్యాలీ నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.