VIDEO: వంతెన నిర్మించాలంటూ గ్రామస్తుల ఆందోళన

TPT: చిల్లకూరు మండలం తిక్కవరం వద్ద తొణుకుమాల, ఉడతావారిపార్లపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి అండర్ బ్రిడ్జి కావాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మేఘ కంపెనీ చేపడుతున్న నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. కాగా, వారికి కంపెనీ ప్రతినిధులు సర్ది చేప్పే ప్రయత్నం చేశారు.