VIDEO: వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు
ADB: జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల సమీపంలో ఉన్న మిషన్ భగీరథ పైపు లీకేజీ అయ్యింది. దీంతో నీరు వృధాగా పోతుందని స్థానికులు తెలిపారు. నీరు పూర్తిగా బురదమయం కావడంతో అటుగా వెళ్లి నీరు కలుషితం అవుతుందని స్థానికులు వాపోయారు. సంబంధిత మునిసిపల్ సిబ్బంది చర్యలు చేపట్టి లీకేజీని నియంత్రించాలని కోరుతున్నారు.