'కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి'

'కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి'

SDPT: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ నాయకులు మీసం మహేందర్ యాదవ్ అన్నారు. చిన్నకోడూర్ మండలంలోని కమ్మర్లపల్లి నూతన గ్రామ పంచాయతీకి భవనం మంజూరైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనం మంజూరుకి సహకరించిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.