జాబ్ క్యాలెండర్ యువతకు భరోసా: ఎమ్మెల్యే
ATP: జాబ్ క్యాలెండర్ విడుదలతో రాష్ట్ర యువత భవిష్యత్తు మెరుగుపడుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి పేర్కొన్నారు. నిరుద్యోగుల కలలు నిజం చేస్తూ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించడం హర్షణీయమన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వివరించారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు.