డివైడర్ నిర్మాణ పనులు ప్రారంభం

డివైడర్ నిర్మాణ పనులు ప్రారంభం

కృష్ణా: ఉయ్యూరు -కాటూరు రోడ్డులో డివైడర్ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, రహదారి భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాసరావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ పోతురాజు, కమ్యూనిటీ ఇంఛార్జ్ నిఖిల్ పాల్గొన్నారు.