టీడీపీ కార్యకర్త నాగేంద్ర మృతిపై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సంతాపం

KDP: రామాపురం మండలం రాచపల్లి గ్రామం వడ్డిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త నాగేంద్ర మృతి పట్ల టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాయచోటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఆయన మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. మండిపల్లి కుటుంబం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.