నీట మునిగిన పంటలు పరిశీలన

నీట మునిగిన పంటలు పరిశీలన

GNT: కొల్లిపర మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఉద్యాన అధికారి శ్రీనిత్య ఈరోజు పరిశీలించారు. గుదిబండివారిపాలెం పోతురాజు డొంక రోడ్డులో నీట మునిగిన పసుపు, కంద తోటలను ఆమె సందర్శించారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లనే పొలాల్లో నీరు నిలిచిపోయిందని అన్నారు. రైతులు వెంటనే నీటిని బయటకు పంపించి, పంట నష్టాన్ని నివారించాలన్నారు.