పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన MLA

పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన MLA

ASF: కౌటాల మండల కేంద్రంలోని వైష్ణవి మాత జిన్నింగ్ మిల్లు వద్ద CCI ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను MLA హరీష్ బాబు శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పత్తి రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.8110 మద్దతు ధర ఇస్తోందని, రైతులందరూ CCI కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని తెలిపారు. కపాస్ కిసాన్ యాప్‌ను రైతులు వినియోగించుకోవాలన్నారు.