పరీక్షల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించిన DRO
CTR: ఇంటర్ ప్రాక్టికల్స్, 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని DROమోహన్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్‌లోని డీఆర్ఓ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. పరీక్షలు పగడ్బందీగా జరిగే విధంగా అధికారులు చూడాలని సూచించారు.