సంక్రాంతి వేళ శాంతిభద్రతలపై అవగాహన
W.G: రానున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉండి మండలం పాములపర్రు, కొల్లమూరు, ఊపుల్లూరు గ్రామాల్లో గ్రామస్థులకు ఉండి ఎస్సై నసీరుల్లా అవగాహన సదస్సు నిర్వహించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటూ ముగ్గుల పోటీలు, యువతను ప్రోత్సహించే క్రీడా పోటీలు నిర్వహించాలని కోడిపందేలు, పేకాట, గుండాట తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.