ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని షాదీఖానాలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే స్వయంగా భోజనాన్ని వడ్డించారు. అనంతరం ఆయన కూడా అల్పాహార విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మండల నాయకులు పాల్గొన్నారు.