ఘనంగా అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు

ATP: గుంతకల్లు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వన్ టౌన్ సీఐ మనోహర్, టూ టౌన్ సీఐ మస్తాన్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. పత్రికా విలేకరులు నిజాన్ని నిర్భయంగా రాయాలని అన్నారు. ఎక్కడో జరిగిన సమాచారాన్ని మన కళ్ల ముందు కనిపించే విధంగా చేసేవారే పత్రికా విలేకరులని వారి సేవలను కొనియాడారు.