గ్రంథాలయాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు?

BDK: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం ప్రారంభానికి నోచుకోవడం లేదు. నిరుద్యోగ యువత ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా పడుతుండడంతో చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత భవనంలోనే గ్రంథాలయాన్ని కొనసాగిస్తుండడంతో అన్ని హంగులతో నిర్మించిన గ్రంథాలయం ఎందుకు ఉపయోగంలోకి తేవడం లేదని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు.