VIDEO: స్వామివారి సన్నిధిలో మంత్రి బీసీ దంపతులు
NDL: యాగంటి ఉమామహేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. కార్తీక రెండో సోమవారం సందర్భంగా ఆలయానికి వచ్చిన వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఈవో పాండురంగారెడ్డి, ఉప సర్పంచ్ మౌలిశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.