భవిత కేంద్రాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
NRML: జిల్లాలోని భవిత కేంద్రాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO భోజన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఫిజియోథెరపిస్ట్(8), స్పీచ్ థెరపిస్ట్(8), కేర్ గివింగ్ వాలంటీర్(10) పోస్టులు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. అర్హత ఉన్న వారు డిసెంబర్ 1 వరకు తమ బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్, ఫొటోలతో DEO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు