సిరికొండలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి
JGL: భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి, పరాక్రమ దివస్ వేడుకలను శ్రీరాం యూత్ యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సిరికొండలో ఘనంగా నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు.