VIDEO: గ్యాస్ గోదాం వద్ద బారులు తీరిన ప్రజలు
RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతపూర్ వద్ద ఉన్న హెచ్‌పీ గ్యాస్ గోదాం వద్ద ఉదయం నుంచి ప్రజలు బారులు తీరారు. గోదాం నుంచి రోడ్డు వరకు క్యూ లైన్‌లో నిలబడ్డారు. గ్యాస్ ఏజెన్సీ వారు గ్యాస్ అందజేస్తున్నప్పటికి సరిపడినంత స్టాకు రాలేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పేటట్టు లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.