రాజ్యాంగంలోని ఆర్టికల్స్ తో అంబేడ్కర్ చిత్రం

రాజ్యాంగంలోని ఆర్టికల్స్ తో అంబేడ్కర్ చిత్రం

తూర్పుగోదావరి: అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగంలోని 448 ఆర్టికల్స్ తో గీసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటం విశేషంగా ఆకట్టుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెనికేరుకు చెందిన యార్లగడ్డ రాజారావు రాజ్యాంగంలోని 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 విభాగాలు, 128 సవరణలతో అంబేడ్కర్ చిత్రపటం రూపొందించారు. ఈ చిత్రపటాన్ని 2 రోజుల 11గంటల వ్యవధిలో గీసినట్లు చెప్పారు.